- శ్రీపతి నవిత
మండే జ్వాల నీ మదిని మండించినా ...
మంచు అనే మమతతో ఆర్పేయ్ దానిని.
ఉప్పొంగే అలలు నీ హృదయంలో ఎగిసినా...
ఊడ్చేయ్ వాటిని ప్రశాంత చిత్తంతో.
పరుగులు తీసే నీ ఆక్రోశం...
పయనించనివ్వకు నీ ప్రేమ దారిలో.
కోటలా పెరిగిన నీ కోపాన్ని
కేంద్రము చేయి శాంతికి.