Menu

మనందరి.కామ్

'విప్లవ సూర్యుడు' - పుస్తక సమీక్ష

November 3, 2017

- బి.అఖిల్ కుమార్

విప్లవ సూర్యుడు

          విప్లవం... అంటే తిరుగుబాటు. ఈ విప్లవ భావాలు ఏర్పడటానికి కారణాలు ఎన్నో. విప్లవానికి దేశంలోని రాజ్యాంగాన్నే మార్చగల శక్తి ఉంది. విప్లవ భావాలతో జాని భాష చరణ్ .తక్కెడశిల గారు రాసిన కవితా సంపుటి ‘విప్లవ సూర్యుడు’. ఇందులో 40 కవితలు ఉన్నాయి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇవన్ని ఒక్కరోజులో రాసినవని. ఈ విషయం పుస్తకం తెరవగానే చూడవచ్చు.

          ఒక్కరోజులో విప్లవాత్మక భావాలతో ఏకంగా 40 కవితలు రాయడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పవచ్చు. గొప్ప కవులకు, కవయిత్రులకు ఇది మామూలే అయుండొచ్చు అయినా ఓ యువకవి ఇలాంటి అభ్యుదయ భావాలతో ఒకేరోజు అన్నింటిని రాయడం అనేది సాధారణం కాదనేది నా భావన.

జాని భాష చరణ్ తక్కెడశిల

కవి

          జాని భాష చరణ్ ‘నా పలుకులు’లో తన భావాలను పంచుకున్నారు. ‘ప్రతి ఒక్కరు ప్రేమించాలి, కానీ ముందు జీవితంలో స్థిరపడాలి, తరువాతే ప్రేమించాలి, అప్పుడే రెండింటిలో విజయాన్ని సాధించగల’మని అఖిలాశ (కవి కలం పేరు) పేర్కొన్నారు. ఇందుకు నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నేటి సమాజంలో కొందరు యువత జీవితంలో స్థిరపడకముందే ప్రేమ అనే మెట్లెక్కి ఆ తరువాత పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. ఆ తరువాత ఏంటి? ప్రేమ అనేది జీవితాంతం ఉండేది. అంతే కాని పెళ్లి వరకు వచ్చి ఆగిపోయేది కాదు. పెళ్లి అయ్యాక పూర్తిచేయని నిర్దిష్టమైన చదువుతో ఏ పదవులు పొందుతారు జీవితాన్ని ఎలా సాగిస్తారు... ఇలాంటివేవి ఆలోచించకుండా గాలిలో మేడలు కట్టేసి ఎదో చేస్తున్నామని ఎదో చేస్తారు. ఇలా చేసినవారిలో కొందరు తీరం చేరతారు కొందరు చేరారు. ఇలాంటివి నిత్యం పేపర్లోనో, టీవీ లోనో చూస్తూనే ఉన్నాం. అయినా అదే ధోరణి. కానీ ఈ ధోరణి మారాలి. ఈ మార్పు అనేది కేవలం వారిలోనే కాదు, అందరిలో రావాలి ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులలో.

          ‘విప్లవ సూర్యుడు’ అన్ని కవితల గురించి రాద్దామనుకున్నా కానీ అలా రాస్తే ఎలా? కాబట్టి కొన్ని కోవితల పై నా అభిప్రాయం రాస్తున్నా.

  1. వాదం

          నీదే వాదం... నాదే వాదం అంటూ ప్రారంభమయిన కవిత మన చుట్టూ ఉన్న సమాజంలో కొందరి స్వభావం పై సాగింది. అంతిమంగా అదుపు తప్పినా ఇంద్రియాలని మనసుతో దారిలో పెట్టమంటూ చైతన్య పరిచే భావంతో ముగిసింది.

  1. వజ్రాయుధం

          ఏంతో గొప్ప భావం ఈ కవిత సొంతం.

          కనపడినది నిజం కాదు

          కనిపించనిది అబద్దం కాదు

          స్వప్నంలో కనిపించేది అబద్దం

          స్వప్నాలను కని నిజం చేసుకో

          అదే నిజం...! అదే నిజం..!

          ఇవి వజ్రాయుధం 26 పంక్తుల కవితలో తోలి ఐదు. నిజమే కదా! నిద్రలో వచ్చే కల నిజిం కాదు. కానీ మన జీవితంలో ఎదగాలనే కలలు మన చేతిలో ఉన్నాయి, వాటిని నిజం చేసుకోవాడం, కపోవడం అనేది మనపై ఆధారపడుంది. నిత్యం పరిగేడుతూండు కానీ కోరికలకి కాదు అంటూ ఇంకెంతో భావంతో మేల్కొలుపుతుంది ఈ కవిత.

  1. పిశాచి

          విలువని మానవత్వానికి ఇవ్వు మతానికి కాదు అని చెబుతూ సాగిన ఈ కవిత ఎంతో అర్థంతో ఉంది. ఈ కవితలో నాకు అమితంగా నచ్చినది సూర్యచంద్రులు ఏ ఒక్క మతం కోసమో ఉదయించట్లేదు అనేది. మతోన్మాదుల పై రాసిన ఈ కవిత అందరినీ ఆలోచింపజేసేదిగా ఉంది.

          ఇలా ‘విప్లవ సూర్యుడు’లో ఎన్నో కవితలు మరెంతో లోతైన భావంతో ఉన్న అఖిలాశ కవితలను చదవచ్చు. యువత, సమాజం, మతం, రాజకీయం, మూడనమ్మకాలు, కాలుష్యం లాంటి ఎన్నో అంశాలు కవితలలో కనిపిస్తాయి. మొత్తంగా అఖిలాశ కవితలను చాలా బాగా రాసారు.

పుస్తకం పేరు: విప్లవ సూర్యుడు

కవి: జాని భాష చరణ్ .తక్కెడశిల

ప్రచురణ: J.V పబ్లికేషన్స్

 
 

Go Back

వ్యాఖ్య


పాఠశాల పంజరం భుజాలపై - కవిత

December 9, 2017

- గజవెళ్ళి శ్రీనివాసాచారి

పుస్తకాల బరువు

మస్తిష్కం నిండా

పాఠాల బరువు

కుసుమాల వంటి

పసి మనసులను

కాలరాస్తున్నది…

పూర్తిగా చదవండి

మనం జీవితంలో ఎదిగేవాళ్ళం... - చిన్న వ్యాసం

December 9, 2017

- జి. భువనేశ్వర రెడ్డి %u0C2D%u0C41%u0C35%u0C28%u0C47%u0C36%u0C4D%u0C35%u0C30%u0C4D

మిత్రులకు నా వందనం

మిత్రమా ! మనం జీవితంలో ఎదిగేవాళ్ళం మన మీద ఎంతో బాధ్యత ఉంది కాబట్టి ఎదగడం కోసం అడ్డదారులు వెతుకుకోవద్దు, పోవద్దు. ఇతరులకు ఏ హాని తలపెట్టవద్దు. మనం ప్రజలకోసం పుట్టినవాళ్ళము ఆ ప్రజల్లోనే …

పూర్తిగా చదవండి

ప్రేమ దిక్సూచితో... - కవిత

December 9, 2017

-కుందేటి వెంకట కల్యాణి కల్యాణి

ఎడారి లాంటి నా జీవితంలో ఒంటరి బాటసారినై నేను

ఒయాసిస్సులా నీవు ప్రవేశించి

నలువైపులా వ్యాపించి…

పూర్తిగా చదవండి

మాతృవేదన - కథ

November 25, 2017

పి.బి.రాజు- పి.బి.రాజు

          కోర్ట్ హాలంతా క్రిక్కిరిసి ఉంది.  అందరూ ఊపిరి బిగబట్టి ఆ అమ్మాయి ఏమి చెబుతుందోనని ఎదురుచూస్తున్నారు.…

పూర్తిగా చదవండి

ఆటంకం లేని ఆరాటం - కవిత

November 25, 2017

- శ్రీపతి నవిత

ఆరాటానికి ఆటంకం

అడ్డుగీత గీసిన

ఆలోచనతో వేసిన అడుగు

అందుకోదా ఆశల ఆకాశం....

 

దూసుకుపోతున్న నీకు…

పూర్తిగా చదవండి

తను - కవిత

November 25, 2017

- సూర్య ఉలిసెట్టిసూర్య

కళ్ళతో  చూసే దాన్ని  "నిజం" అని,

కళ్ళతో చూడని దానిని "కల" అని,

అనుభవంతో చూసిన దాన్ని "జ్ఞాపకం" అని అంటాం…

పూర్తిగా చదవండి

సమయం - కవిత

November 25, 2017

-ఆదిత్య అన్నదేవర ఆదిత్య అన్నదేవర

సమయాన్ని పొదుపులో ఉంచితే గెలుపు నీ అదుపులో ఉంటుంది.

ఎవరో సలహా లేదా సహాయం కోసం కూర్చుంటే నీ లక్ష్యం కోసం చేరుటకు…

పూర్తిగా చదవండి

చెలియా - కవిత

November 25, 2017

- అరవింద్ సిద్దోజు %u0C05%u0C30%u0C35%u0C3F%u0C02%u0C26%u0C4D

నేల నింగి నడుమ పూపల్లకిలో నిను విహరింపజేయనా....

మరల మది మరవనన్న నీ జ్ఞాపకాలను బహుమానంగా ఇవ్వనా...…

పూర్తిగా చదవండి

ధైర్యం - కవిత

November 25, 2017

-ఆదిత్య అన్నదేవర ఆదిత్య అన్నదేవర

ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేస్తె భయం వందడుగులు వెనక్కు వేస్తుంది

తోడు వెతుక్కునే భయానికి మిత్రుడు వయ్యేకన్నా.... శత్రువు అవ్వడం మ…

పూర్తిగా చదవండి

View older posts »


Guestbook
మీ భావాలను పంచుకోండి...
 

sir,we are unable to open the link for november magazine on home page..,please slove this issue soon

కథ చక్కగా ఉంది

nenu ikkada kothaga vachanu naaku kavithalu ante ishtame konthamandhi full meeaning lekunda cheptharu andhukane ekakkada post cheyyalekapoyanu konni sites lo comments pettadam meanning lekunda evaraina comment pedithe reply ivvadam chesthuntanu inka ikkada kavithalu chudaledhu okasari chusi join avuthanu....... bye friends

Kalyani gaaru mi kavithalanni chala baguntay Andi kottaga.

Nature lo inni unnayani ippude telisindi thank you kalyani gaaru

Displaying all 6 comments